VIDEO: కేటీఆర్‌పై సుమోటోగా కేసు నమోదు చేయాలి: మంత్రి
HYD: కేటీఆర్‌పై ఎన్నికల కమిషన్ సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఓటర్లను కొనుగోలు చేసే పద్ధతిలో ఓటుకి రూ. 5వేలు అడుక్కోండని చెప్పడం అక్షేపణీయమని, ఎన్నికల కమిషన్‌కు కాంగ్రెస్ పార్టీ తరఫున ఫిర్యాదు చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీని ఎదురుకోవడానికి BJP, BRSలు కుమ్మక్కై BJP మూడు అంకెలు దాటని వ్యక్తిని అభ్యర్థిగా పెట్టిందన్నారు.