ఆంధ్రాలో సింగిల్ విండో విధానం కావాలి: దిలీప్ రాజా

ఆంధ్రాలో సింగిల్ విండో విధానం కావాలి: దిలీప్ రాజా

GNTR: తెలంగాణ ప్రభుత్వం సినిమా చిత్రీకరణలు, థియేటర్ల అనుమతులను సింగిల్ విండో ద్వారా ఇస్తుందని సినీ దర్శకుడు దిలీప్ రాజా అన్నారు. మంగళవారం ఆయన తెనాలిలో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో అలాంటివి లేవని విమర్శించారు. ‘ఫిల్మ్స్ ఇన్ తెలంగాణ’ వెబ్‌సైట్ ద్వారా అంతర్జాతీయ సినిమాలకు కూడా అనుమతులు లభిస్తాయని, ఏపీలో కూడా ఆ దిశగా అడుగులు వేయాలని ప్రభుత్వాన్ని కోరారు.