రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

ATP: తాడిపత్రి మండలం తేరన్నపల్లి వద్ద గల విద్యుత్ ఉప కేంద్రంలో రేపు మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ ఏడీ ప్రభాకర్ రావు ఇవాళ తెలిపారు. తాడిపత్రి పట్టణ, మండల ప్రాంతాలలో శనివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామన్నారు. వినియోగదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.