సుందరీమణుల రాకకు రామప్ప ముస్తాబు

MLG: వెంకటాపూర్ మండలం పాలంపేటలో గల యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని ఈనెల 14న మిస్ వరల్డ్ గ్రూప్ -2 సుందరీమణులు సందర్శించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పర్యాటకశాఖ, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రామప్పలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ పరిసరాల సుందరీకరణకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు.