నేలరాలిన మొక్కజొన్న.. రైతు ఆవేదన
NTR: వీరులపాడు మండలం జుజ్జూరుల్లో శనివారం కురిసిన భారీ వర్షానికి ఆరు ఎకరాల్లో సాగుచేసిన మొక్కజొన్న పంట నేలరాలిదని రైతు వెంకటేశ్వరావు వాపోయారు. తీవ్ర నష్టంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. నేల వాలిన పంటను మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరారు. అలాగే పంట నష్టాన్ని అధికారులు అంచనా వేసి తగిన ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.