బిల్డింగ్‌పై నుంచి కిందపడి యువకుడు మృతి

బిల్డింగ్‌పై నుంచి కిందపడి యువకుడు మృతి

BHPL: దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని అశోక్‌నగర్ లోటస్ హాస్టల్‌లో శుక్రవారం తెల్లవారుజామున దారుణ ఘటన చోటుచేసుకుంది. భూపాలపల్లి జిల్లా అంబడిపల్లి గ్రామానికి చెందిన బాసనీ ఆనంద్ (26) ‌బిల్డింగ్‌పై అంతస్తు నుంచి కింద పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. స్పృహ కోల్పోయిన ఆనంద్‌ను హాస్టల్ సిబ్బంది ఆసుపత్రికి తరలించగా, చికిత్స అందిస్తూ మరణించినట్లు వైద్యులు తెలిపారు.