మే 4న స్థానికులకు శ్రీవారి దర్శన టోకెన్ల జారీ.!

TPT: ప్రతి నెల మొదటి మంగళవారం తిరుపతి, తిరుమలలోని స్థానికులకు టీటీడీ శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మే నెల కోటా దర్శన టికెట్లను ఈ నెల 4వ తేదీన ఆదివారం టీటీడీ జారీ చేయనుంది. తిరుపతి స్థానికులకు మహతి ఆడిటోరియం కౌంటర్, తిరుమల స్థానికులకు బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్‌లో టిక్కెట్లు జారీ చేయనున్నారు.