ఇల్లు కట్టుకోనివ్వటం లేదంటూ.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సూసైడ్

ఇల్లు కట్టుకోనివ్వటం లేదంటూ.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సూసైడ్

నగరపాలక సంస్థ అధికారుల వేధింపులు తట్టుకోలేక ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బెంగళూరులో జరిగింది. నల్లురహళ్లి ప్రాంతంలో సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు మురళి పనులు చేపట్టాడు. అయితే అధికారులు పదే పదే ఆటంకం కలిగిస్తూ.. డబ్బులు వసూలుకు డిమాండ్ చేస్తున్నారు. వారితో విసిగి చెందిన మురళి నిర్మాణంలో ఉన్న సొంతింటిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.