రేపటి టీఎల్ఎం మేళాను వాయిదా వేశాం: శైలజ

MNCL: లక్షెట్టిపేట పట్టణంలో రేపు నిర్వహించాల్సిన టీఎల్ఎం మేళాను వాయిదా వేశామని మండల విద్యాధికారి శైలజ తెలిపారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. అధికారుల ఆదేశాల మేరకు మంగళవారం పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో మండల స్థాయి టీఎల్ఎం మేళాను నిర్వహించాల్సి ఉందన్నారు. అయితే భారీ వర్షాల కారణంగా టిఎల్ఎం మేలాను వాయిదా వేశామని, మళ్లీ నిర్వహించే తేదీలను త్వరలో ప్రకటిస్తామన్నారు.