సర్పంచ్‌గా సుద్దాల కమలాకర్ విజయం

సర్పంచ్‌గా సుద్దాల కమలాకర్ విజయం

KNR: కరీంనగర్ రూరల్ మండలంలో గురువారం గ్రామ పంచాయతీ పోలింగ్, అనంతరం ఓట్ల లెక్కింపు జరిగింది. పోలింగ్ ముగియగానే ప్రారంభమైన కౌంటింగ్‌లో జూబ్లీ నగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా సుద్దాల కమలాకర్ విజయం సాధించారు. తనను నమ్మి, గెలిపించిన గ్రామ ప్రజలకు సుద్దాల కమలాకర్ ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆయన విజయం పట్ల మద్దతుదారులు హర్షం వ్యక్తం చేశారు.