లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సబ్ రిజిస్ట్రార్

ADB: జిల్లాలో ఏసీబీ అధికారులు శుక్రవారం నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ రెడ్డి పట్టుబడ్డారు. గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ కోసం బాధితుడు మన్నూర్ ఖాన్ నుంచి రూ. 5 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వ్యక్తి దగ్గర నుంచి రూ.10 వేలు డిమాండ్ చేయగా, రూ.5 వేలకు ఒప్పందం కుదిరినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.