కర్రెగుట్టలో కూంబింగ్.. ఆదివాసీలకు ఆదేశాలు

కర్రెగుట్ట ప్రాంతంలో భద్రతా బలగాలు పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. బలగాల ప్రధాన దృష్టి కర్రెగుట్టలపైనే ఉంది. ఆర్మీ హెలికాప్టర్లు గ్రామాలపై చక్కర్లు కొడుతున్నాయి. కూంబింగ్‌లో CRPF, కోబ్రా, DRG సహా STF బలగాలు పాల్గొంటున్నాయి. ఇప్పటివరకు బలగాలకు మావోయిస్టుల జాడ లభించలేదు. భద్రతా కారణాల దృష్ట్యా కర్రెగుట్టల వైపు ఎవరూ రావద్దని ఆదివాసీలకు ఆదేశాలు జారీ చేశారు.