ప్రజావాణి కార్యక్రమానికి బారులు తీరిన ప్రజలు

HNK: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు బారులు తీరారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుంచి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ ప్రావీణ్యకు వినతి పత్రాలను అందించారు. ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సంబంధిత అధికారులు తగిన ఏర్పాటను చేశారు.