గండి అంజన్నకు ప్రత్యేక పూజలు

KDP: జిల్లాలో ప్రసిద్ధి చెందిన గండి వీరాంజనేయ స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రావణ మాసం చివరి రోజు కావడంతో జిల్లా నలుమూలల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. అనంతరం అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.