దూప్ సింగ్ తండా బ్రిడ్జిని పరిశీలించిన బీజేపీ నాయకులు

దూప్ సింగ్ తండా బ్రిడ్జిని పరిశీలించిన బీజేపీ నాయకులు

MDK : హవేలీ ఘనాపూర్ మండలం దూప్ సింగ్ తండా బ్రిడ్జిను బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. గత కొన్ని ఏళ్లుగా ఈ బ్రిడ్జి నిర్మాణం ఆగిపోయిందని, ప్రతి సారి వర్షాలు భారీగా పడ్డప్పుడు తండా వాసులు వేరే గ్రామాలకు వెళ్లలేని పరిస్థితి ఉందన్నారు. అధికారులు వెంటనే స్పందించి బ్రిడ్జి పనులను పూర్తి చేయాలని అన్నారు.