పునుగోడులో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ
ప్రకాశం: కనిగిరి మండలం పునుగోడు రైతు సేవా కేంద్రంలో సిబ్బందికి, రైతులకు ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ నిర్వహించారు. మండల ఏవో జైనులాబ్దీన్ పాల్గొని విత్తన గుళికలు వినియోగం, భూసారం సంరక్షణ, సేంద్రియ కర్బనం పెంపు ద్వారా దిగుబడులు పెరుగుతాయని తెలిపారు. ప్రకృతి వ్యవసాయం వల్ల సాగు ఖర్చులు తగ్గడంతో పాటు రసాయన ఎరువుల వినియోగం తగ్గి, ఆరోగ్యకరమైన ఆహారం లభిస్తుందని వివరించారు.