కోతల పొలాల్లో గిరి రైతులు బిజీ
ASR: తుఫాన్, వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గిరి రైతులు మళ్లీ వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాల ప్రభావంతో ఆగిపోయిన కోత పనులను పునఃప్రారంభించినట్లు గిరిజన రైతులు తెలిపారు. డుంబ్రిగూడ మండల వ్యాప్తంగా పొలాల్లో పండిన ధాన్యానికి కోతలు పెట్టే పనుల్లో గిరి రైతులు బిజీగా కనిపిస్తున్నారు.