శిథిలావస్థకు చేరుకున్న దువ్వ రెగ్యులేటర్

శిథిలావస్థకు చేరుకున్న దువ్వ రెగ్యులేటర్

W.G: దాదాపు శతాబ్ధ కాలంగా సేవలు అందిస్తున్న దువ్వ రెగ్యులేటర్ శిథిలావస్థవకు చేరుకుంది. వరదల సమయంలో పంట పొలాలు, లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. అధిక వర్షాల కారణంగా సామర్థ్యానికి మించి వరద ప్రవహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వాలు హామీలు ఇచ్చి కూడా అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.