ఈతకు వెళ్లిన బాలుడు మృతి

ఈతకు వెళ్లిన బాలుడు మృతి

GDWL: మల్దకల్ మండలం అమరవాయి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జయరాజు (13) ఆదివారం మధ్యాహ్నం స్నేహితులతో కలిసి సమీపంలోని బావిలో ఈత కొట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. నీటి లోతు ఎక్కువగా ఉండటంతో బాలుడు గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న SI శ్రీహరి సిబ్బందితో చేరుకుని గాలింపు చర్యలు ప్రారంభించారు.