ఆదర్శమైన గ్రామాలుగా రేండ్లగూడ, దేవుని గూడెం

ఆదర్శమైన గ్రామాలుగా రేండ్లగూడ, దేవుని గూడెం

మంచిర్యాల జిల్లాలోనే ఆదర్శమైన గ్రామాలుగా జన్నారం మండలంలోని రేండ్లగూడ-మందపల్లి, దేవుని గూడెం గ్రామాలు నిలిచాయి. పచ్చదనం పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజా సమస్యల పరిష్కారం, తదితర విషయాల్లో ఆ రెండు గ్రామాల ప్రజా ప్రతినిధులు, కార్యదర్శులు పనిచేయడంతో 2024 నుండి ఉత్తమ గ్రామపంచాయతీలుగా గుర్తింపు పొంది కలెక్టర్ చేతుల మీదుగా అవార్డులు స్వీకరించారు.