కవి నూనె రాజేశంకు కవితా సంపుటి పురస్కారం

కవి నూనె రాజేశంకు కవితా సంపుటి పురస్కారం

PDPL: రామగిరి మండలానికి చెందిన తెలంగాణ రాష్ట్ర ఉత్తమ కవి రచయిత నూనె రాజేశంకు 8వ కవితా సంపుటి పురస్కారం లభించింది. కరీంనగర్ ఫిలిం భవన్‌లో శ్రీ గౌతమేశ్వర సాహితీ సేవా సంస్థ ఆధ్వర్యంలో దూడపాక శ్రీధర్ అధ్యక్షతన ఇవాళ ఘన సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కవి వైరాగ్యం ప్రభాకర్, తుమ్ నరసయ్య, తదితరులు శాలువా, ప్రశంసాపత్రం, కీర్తికిరీటంతో సన్మానించారు.