VIDEO: రిజర్వాయర్‌లో చేప పిల్లలను వదిలిన ఎమ్మెల్యే
NLG: నాగార్జునసాగర్ రిజర్వాయర్‌లో ఎమ్మెల్యే జై వీర్‌రెడ్డి ఇవాళ 10 లక్షల చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. అన్ని వర్గాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.