మచిలీపట్నంలో షిప్‌యార్డ్ పరిశ్రమ: మంత్రి కొల్లు
AP: గోవా షిప్‌యార్డు రూ.6 వేల కోట్ల పెట్టుబడితో మచిలీపట్నంలో షిప్‌యార్డు పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చినట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఘంటలమ్మపాలెంలో రూ.75 లక్షల నాబార్డు నిధులతో రహదారి అభివృద్ధి పనులకు రవీంద్ర శంకుస్థాపన చేసి మాట్లాడారు. 2026లో పోర్టు నిర్మాణం పూర్తి కానుందన్నారు. త్వరలో ఇంటింటికీ తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.