రోడ్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం
NZB: ఆర్మూర్ ఆలూరు బైపాస్ రోడ్డుపై పోలీసుల ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీఐ సత్యనారాయణ గౌడ్ మైనర్లు వాహనాలు నడపకూడదని, హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ఉపయోగించాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్య క్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.