విదేశీ విద్యా పథకాన్ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది

NLR: నెల్లూరు టీడీపీ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గత ప్రభుత్వం అంబేద్కర్ విదేశీ విద్య పథకాన్ని పేరు మార్చి నిర్వీర్యం చేసిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని పునరుద్దించాలని నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు.