ఉపాధి హామీ రోజు కూలీ పెంచాలని డిమాండ్

ఉపాధి హామీ రోజు కూలీ పెంచాలని డిమాండ్

NLG: కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీకి బడ్జెట్లో అధిక నిధులు కేటాయించి రోజు కూలీ రూ.600 లు పెంచాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కంబాలపల్లి ఆనంద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం చందంపేట మండలం ముర్పునూతలలో ఉపాధి హామీ కూలీల పని ప్రదేశంలో కూలీల నుంచి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం కేంద్ర బడ్జెట్ కేవలం రూ.86 వేల కోట్లు కేటాయించిందన్నారు.