విదేశీ ఉద్యోగాల పేరుతో మోసం.. 22 మంది అరెస్ట్

విదేశీ ఉద్యోగాల పేరుతో మోసం.. 22 మంది అరెస్ట్

VSP: కాంబోడియా, మయన్మార్ వంటి దేశాలకు యువతను అక్రమంగా తరలిస్తున్న ముఠాలపై విశాఖ పోలీసులు ఉక్కుపాదం మోపారు. డేటా ఎంట్రీ జాబ్ పేరుతో మోసం చేస్తున్న గాజువాక ఏజెంట్ సురేశ్‌తో పాటు 22 మందిని అరెస్టు చేశారు. మోసపోయిన 85 మందిని స్వదేశానికి రప్పించామని సీపీ శంకబ్రత బాగ్చి తెలిపారు. అనధికారిక ఏజెంట్లను నమ్మవద్దని, అనుమానాస్పద వ్యక్తుల గురించి1930కు ఫిర్యాదుచేయాలన్నారు.