'పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి'

ASR: పీఎం జన్ మన్ ఇళ్ల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని ఆదివాసీ గిరిజన సంఘం అరకు మండల కమిటీ సభ్యులు గెమ్మెలి చిన్నబాబు కోరారు. గురువారం పెదగంగగుడి, సంఘంవలస గ్రామాల్లో పర్యటించారు. ఆయా గ్రామాల్లో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాలు పరిశీలించారు. లబ్దిదారులకు హౌసింగ్ బిల్లులు సకాలంలో చెల్లించాలన్నారు. పెంచిన రూ.1లక్షను వెంటనే లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయాలన్నారు.