రేపు పెన్షన్లు పంపిణీ చేయనున్న మంత్రి ఆనం
NLR: సంగం మండలం గాంధీజనసంఘం గిరిజన కాలనీలో సోమవారం ఎన్టీఆర్ పెన్షన్ల పంపిణీ జరగనుంది. దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్వయంగా లబ్ధిదారులకు పెన్షన్ను అందజేస్తారు. అనంతరం గ్రామపంచాయతీ కొత్త భవన నిర్మాణానికి రూ.32 లక్షల పనులు, రామాలయం కాంపౌండ్ వాల్కు రూ.5 లక్షలు, NREGS నిధులతో రూ.14 లక్షల సీసీ రోడ్ పనులను మంత్రి పరిశీలించనున్నారు.