చందుర్తి మండలంలో ఎన్నికల పోలింగ్ ప్రారంభం

చందుర్తి మండలంలో ఎన్నికల పోలింగ్ ప్రారంభం

SRCL: చందుర్తి మండలంలో తొలి దశ గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మండలంలోని 19 గ్రామాల్లో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మండలంలో మొత్తం 28094 ఓటర్లు ఉన్నారు. పురుషులు13445, స్త్రీలు14649 మంది ఉన్నారు. పోలింగ్ సందర్భంగా అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.