విజయోత్సవ ర్యాలీలు నిషేధం: SP
KMR: ఎన్నికల ఫలితాల సందర్భంగా విజయోత్సవ ర్యాలీలను పూర్తిగా నిషేధిస్తున్నట్లు కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర స్పష్టం చేశారు. జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిన నేపథ్యంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఎస్పీ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.