పశువులకు ఉచిత చికిత్స శిబిరం

పశువులకు ఉచిత చికిత్స శిబిరం

GDWL: వడ్డేపల్లి మండలం కొంకలలో పశు వైద్య ఉపకేంద్రం వద్ద పశు వైద్య, పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఉచిత పశు గర్భకోశ వ్యాధి నివారణ శిబిరం నిర్వహించారు. వ్యాధులు రాకుండా పశు వైద్యులు, సిబ్బంది సలహాలు, సూచనలను రైతులకు వివరించారు. చూడి పరీక్షలు 13, గర్భాశయ వ్యాధి 12, దూడల నట్టల నివారణ 12, సాధారణ రోగాలు 10 పశువులకు చికిత్సలు చేశారు.