మీకోసం కార్యక్రమం నిర్వహించిన ఎంపీ బాలసౌరి

మీకోసం కార్యక్రమం నిర్వహించిన ఎంపీ బాలసౌరి

కృష్ణా: మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి మీకోసం కార్యక్రమాన్ని ఎంపీ కార్యాలయంలో నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను పరిష్కరించమని కోరుతూ ఎంపీ బాలశౌరికి అర్జీలను అందజేశారు. సమస్యలను సానుకూలంగా విని వాటి పరిష్కార దిశగా అధికారులతో మాట్లాడి పరిష్కరించే విధంగా ఆదేశాలు జారీ చేశారు.