విశాఖ నగరాన్ని అందంగా తీర్చిదిద్దాలి: కమిషనర్
VSP: నగరంలో ఈ నెల 15 నుంచి ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ నిర్వహించనున్న నేపథ్యంలో నగరాన్ని అందంగా తీర్చిదిద్దాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అధికారులను ఆదేశించారు. బీచ్ రోడ్‌లోని పలు ప్రాంతాల్లో పర్యటించి, పెయింటింగ్, హార్టికల్చర్ అధికారులతో పనుల పురోగతిని సమీక్షించారు. ఇందుకోసం రూ.15 కోట్లతో పనులు జరుగుతున్నాయని, ప్రముఖులు పాల్గొననున్నారని తెలిపారు.