విశాఖ నటుడికి సైమా అవార్డు

విశాఖ నటుడికి సైమా అవార్డు

విశాఖ: జిల్లాకు చెందిన యువ నటుడు పేడాడ సందీప్ సరోజ్ అంతర్జాతీయ వేదికపై అరుదైన గౌరవం అందుకున్నారు. దుబాయ్‌లో జరిగిన ప్రతిష్టాత్మక సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా-2025) వేడుకలో 'కమిటీ కుర్రోళ్లు' సినిమాలో అద్భుతమైన నటనకుగానూ అతడికి ఉత్తమ నూతన నటుడు (బెస్ట్ డెబ్యూ హీరో) పురస్కారం లభించింది.