VIDEO: పెద్ద చెరువులో గుర్తు తెలియని మృతదేహం

VIDEO: పెద్ద చెరువులో గుర్తు తెలియని మృతదేహం

MHBD: గంగారం మండలం కోమట్లగూడెం గ్రామపంచాయతీలోని పెద్ద చెరువులో ఈరోజు ఉదయం ఒక వ్యక్తి మృతదేహం నీటిపై తేలుతూ కనిపించింది. స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు ఎవరు, ఏ గ్రామానికి చెందినవాడు అన్న విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇది ప్రమాదవశాత్తు జరిగిన మరణమా లేక ఆత్మహత్యనా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టనున్నారు.