జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామీణ మహిళలకు గుడ్ న్యూస్
నల్లగొండ పట్టణ శివారులోని SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో గ్రామీణ నిరుద్యోగ స్త్రీలకు, బ్యూటీ పార్లర్ కోర్స్‌లో 35 రోజుల ఉచిత శిక్షణ అందజేస్తున్నామని ఇవాళ సంస్థ సంచాలకులు సియాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ కలంలో ఉచిత వసతి, భోజనం కల్పిస్తామన్నారు. 18 నుంచి 45 సంవత్సరాల లోపు వారు అర్హులన్నారు. ఈనెల 4 వరకు దరఖాస్తు చేసుకోవాలి సూచించారు.