'టీయూలో హైకోర్టు తీర్పు అమలు చేయాలి'
NZB: తెలంగాణ విశ్వవిద్యాలయంలో 2012 సంవత్సరంలో జరిగిన అక్రమ నియామకాలపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని ఏఐఎఫ్బీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజుగౌడ్ ఇవాళ డిమాండ్ చేశారు. కోర్టు తీర్పు వెలువరించి చాలా రోజులైనా ఇప్పటికీ అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు హైకోర్టు తీర్పుని వెంటనే అమలు చేయాలన్నారు.