పరిగి పర్యటన.. మాజీ మంత్రి హౌస్ అరెస్ట్
HYD: పరిగి మండలం కాడ్లాపూర్ గ్రామంలో మాజీ మంత్రి హరీశ్ రావు ఇవాళ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను ఈ పర్యటనకు వెళ్లకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ మేరకు హరీశ్ రావు నివాసం వద్ద భారీగా పోలీసు బలాగాలు మోహరించాయి. ఇండస్ట్రియల్ పార్కు బాధిత రైతులను కలిసేందుకు వెళ్లకుండా BRS నేతలపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఇప్పటికే పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు.