'మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలి'

NZB: సమాచార హక్కు చట్టం కింద సమాచారం ఇవ్వని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులపై చర్యలు తీసుకోవాలని బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట్ అన్నారు. నిజామాబాద్ నగరంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ కార్పొరేషన్‌లో 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సమాచారం ఇవ్వాలని దరఖాస్తు చేసుకొని 40 రోజులైనా సమాచారం ఇవ్వడం లేదన్నారు.