ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే
VSP: సీతంపేటలో ఇవాళ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, వారి నుంచి వినతులను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.