డోకులూరులో 'పొలంబడి' కార్యక్రమం
ASR: వరి పంట తరువాత పొలాలను ఖాళీగా ఉంచకుండా కొమ్ము శనగ, మొక్కజొన్న పంటలను వేసుకోవచ్చని జీకేవీధి ఏవో డీ.గిరిబాబు రైతులకు సూచించారు. దీని వల్ల రైతులు అదనపు ఆదాయం పొందవచ్చన్నారు. దుక్కి దున్నకుండా (జీరో టిల్లేజ్) ఈ పంటలు వేసుకోవచ్చని తెలిపారు. శుక్రవారం డోకులూరు గ్రామంలో 'పొలంబడి' కార్యక్రమం నిర్వహించారు. ఆసక్తిగల రైతులకు విత్తనాలు పంపిణీ చేస్తామన్నారు.