రెండు తలలతో పుట్టిన గొర్రె పిల్ల

రెండు తలలతో పుట్టిన గొర్రె పిల్ల

నల్గొండ: తిప్పర్తి మండలంలోనీ అనిశెట్టి దుప్పలపల్లికి చెందిన కన్నెబోయిన చెన్నయ్య గొర్రెల మందలోని ఓ గొర్రె మంగళవారం సాయంత్రం రెండు తలలతో గొర్రె పిల్లకి జన్మనిచ్చింది. వింత ఆకారంలో జన్మించిన గొర్రె పిల్లను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జన్యు పరమైన లోపంతో ఇలా జరుగుతుందని పశువైద్యులు చెబుతున్నారు.