కత్తులతో దాడి.. యువకుడికి తీవ్ర గాయాలు

కోనసీమ: కాట్రేనికోన మండలంలోని అతి సమస్యాత్మక మత్స్యకార గ్రామం పల్లంలో ఇరు కుటుంబాల మద్య ఘర్షణ తలెత్తడంతో ఒకరిపై మరొకరు కత్తులతో దాడిచేసుకోగా ఇరువర్గాలకూ చెందిన ఏడుగురికి గాయాలు అయ్యాయి. రెండురోజుల క్రితం చిన్న గొడవ కాగా, పోలీసులకు ఫిర్యాదు చేస్తారనే అపోహతో మరల వచ్చి గొడవపడి దాడి చేసినట్టు తెలియచేశారు.