చెరువులో మహిళ మృతదేహం లభ్యం
ATP: గుంతకల్లు మండలం వైటీ చెరువు గ్రామంలోని చెరువులో ఓ గుర్తు తెలియని మహిళ శవం లభ్యమైంది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది. ఆత్మహత్య చేసుకుందా లేదా? ఎవరైనా చంపి చెరువులో పడేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.