TG మద్యం పాలసీపై ఏపీ సర్కార్ ఫోకస్

TG మద్యం పాలసీపై ఏపీ సర్కార్ ఫోకస్

TG: రాష్ట్రంలో అమలవుతున్న మద్యం పాలసీపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించినట్లు సమాచారం. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు, దరఖాస్తు రుసుము పెంపు ద్వారా ప్రభుత్వానికి లభిస్తున్న భారీ ఆదాయం వంటి అంశాలను ఏపీ సర్కార్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం ఏపీ ఎక్సైజ్‌ అధికారుల బృందం రాష్ట్ర మద్యం పాలసీ వివరాలను సేకరించింది.