ప్రభుత్వ భూమిని ఆక్రమించిన ముగ్గురిపై కేసు నమోదు

ప్రభుత్వ భూమిని ఆక్రమించిన ముగ్గురిపై కేసు నమోదు

SRCL: ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామ శివారులో ప్రభుత్వ భూమిని ఆక్రమించిన ముగ్గురు వ్యక్తులపై మంగళవారం కేసు నమోదు చేసినట్టు ఎస్సై రాహుల్ రెడ్డి తెలిపారు. వెంకటాపూర్ గ్రామ శివారులోని సర్వే నెంబరు 1070 లో ప్రభుత్వ భూమిని ఆక్రమించారని పేర్కొన్నారు. తహసీల్దార్ సుజాత ఫిర్యాదు మేరకు శ్రీనివాస్, తిరుపతి, పెద్దలక్ష్మి,,అనే ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.