వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు

VZM: గజపతినగరం మండలంలోని రామన్నపేట గ్రామంలో కొండ్రోతు సూర్యనారాయణ(50) అనే వ్యక్తి గురువారం నుంచి కనిపించడం లేదని కుమారుడు యోహాను గజపతినగరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గత మూడు రోజుల నుంచి కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గ్రామాల్లో వెతుకుతున్నట్లు తెలిపారు. ఆచూకీ తెలిసినవారు గజపతినగరం పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలన్నారు.