రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు పొదిలి విద్యార్థి ఎంపిక..!
ప్రకాశం: SGFI రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు పొదిలి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థి మారావతు సుదర్శన్ ఎంపికైనట్లు HM పి. కరీమున్ బీబీ తెలిపారు. సోమవారం జరిగిన జిల్లా స్థాయి చెస్ పోటీలలో ప్రతిభ కనబరచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థికి అభినందనలు తెలియజేశారు.