'స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర'లో పోలీసుల శుభ్రత డ్రైవ్
GNTR: 'స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర' కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో విస్తృత శుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు. ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలతో సిబ్బంది స్టేషన్లు, రికార్డులు, పరిసరాలను శుభ్రపరిచి వ్యర్థాలను తొలగించారు. భద్రతా పరికరాలను తనిఖీ చేస్తూ, ప్రజలకు మెరుగైన సేవల కోసం పరిశుభ్రతపై దృష్టి సారించారు.